'ఎవరు మీలో కోటీశ్వరులు' షూటింగ్ కంప్లీట్ చేసిన తారక్!
on Oct 19, 2021
బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 హోస్ట్‌గా బుల్లితెరపై అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్, రెండోసారి 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోతో వ్యూయర్స్ ముందుకు వచ్చాడు. తనదైన ఎనర్జీతో హోస్ట్‌గా ఆకట్టుకుంటున్నాడు. జెమిని టీవీలో ప్రసారమవుతోన్న ఈ షోకు సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని తారక్ కంప్లీట్ చేశాడు. 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో అన్ని ఎపిసోడ్లను తారక్ పూర్తి చేశాడనీ, వీటిలో మహేశ్‌బాబు, దేవి శ్రీప్రసాద్, తమన్ గెస్ట్ కంటెస్టెంట్లుగా పాల్గొన్న ఎపిసోడ్స్ కూడా ఉన్నాయనీ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
జూనియర్ ఎన్టీఆర్ ఎంతగా తన సమయస్ఫూర్తితో కంటెస్టెంట్లను ప్రశ్నలు అడుగుతూ, సరదాగా వారితో మాట్లాడుతూ ఆకట్టుకుంటున్నప్పటికీ, అంచనాలకు తగ్గట్లు 'ఎవరు మీలో కోటీశ్వరులు' వీక్షకాదరణ పొందలేదని విశ్లేషకులు అంటున్నారు. రామ్‌చరణ్‌తో చేసిన కర్టెన్ రైజర్ ఎపిసోడ్, సమంతతో చేసిన ఎపిసోడ్లకు వచ్చిన ఆదరణ రెగ్యులర్ కంటెస్టెంట్లతో చేసిన ఎపిసోడ్లకు రాలేదు.
ఏదేమైనా ఈ షోకు హోస్ట్‌గా చేయడం ద్వారా భారీ పారితోషికాన్ని అందుకున్నాడు తారక్. వచ్చే ఏడాది కూడా ఈ షో సీజన్‌కు ఆయన హోస్ట్‌గా కంటిన్యూ అవుతాడో, లేదో చూడాలి.
సినిమాల విషయానికి వస్తే, ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్' షూటింగ్‌ను కంప్లీట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్, తదుపరి సినిమా కోసం మేకోవర్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. తారక్ నటించే ఈ 30వ సినిమాకు కొరటాల శివ దర్శకుడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
